ప్రభాస్ కున్న క్రేజ్ ముందు…!!

Sahoo Teaser review Telugu Cinema news

బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలో ఎలా కనిపిస్తాడా అనే ఆసక్తితో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఉన్నాడు. అలాగే బాహుబలితో ఫుల్ క్రేజ్ కొట్టేసిన ప్రభాస్ తదుపరి చిత్రం సాహో మీద భారీగా అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సాహో నిర్మాతలు ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు కళ్ళు చెదిరిపోయే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేశంలోని నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సాహో చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. మరి దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని ఎలాంటి కథతో భారీగా తెరకెక్కిస్తున్నాడో తెలియదు గానీ.. ఆ కథ మీద యూవి క్రియేషన్స్ వారికీ ఎంత నమ్మకం లేకపోతె అంతటి బడ్జెట్ పెడతారో అని.

హిందీ హక్కులు…..

బాహుబలితో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ పెంచుకున్న ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా నిర్మితమవుతుంది. అయితే ఈ సినిమాకున్న విపరీతమైన క్రేజ్ కారణంగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు సాహో చిత్రంపై కన్నేసినట్లుగా తెలుస్తుంది. అలాగే వారు ఎంతటి రేటు పెట్టయినా హిందీ సాహో హక్కులు దక్కించుకోవడానికి రేడి అవుతున్నారట. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సాహో చిత్ర హిందీ హక్కులు ఎవరూ ఊహించని విధంగా దాదాపు 120 కోట్ల అఫర్ తో అమ్ముడుపోనున్నాయనే టాక్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*