హమ్మయ్య ప్రభాస్ మరో సినిమా మొదలవుతోంది..!

సాహో

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ చిత్రంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ను ఫినిష్ చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. యాభై శాతం కూడా కంప్లీట్ అవ్వని ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మేకర్స్. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాను లైన్ లో పెట్టుకున్నాడు.

జిల్ దర్శకుడితో…

‘సాహో’ తర్వాత ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ సెప్టెంబర్ 6న ఉండబోతుందని సమాచారం. ఆ మేరకు జిల్ రాధాకృష్ణ తన సినిమా ప్రారంభోత్సవం కోసం ప్రిపరేషన్ లో ఉన్నారని చెబుతున్నారు. జిల్ సినిమాతో యూత్ ని ఆకట్టుకున్న ఈ దర్శకుడు ప్రభాస్ ని ఎలా డైరెక్ట్ చేస్తాడో చూడాలి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ `సాహో` లేట్ అవ్వటం వల్ల రాధాకృష్ణ ఇన్నాళ్లు వేచి చూడాల్సొచ్చింది.

స్వయంగా నిర్మించనున్న కృష్ణంరాజు…

ఎట్టకేలకు సినిమాను లాంచ్ చేసేస్తున్నారు కాబట్టి ‘సాహో’ చిత్రీకరణ పూర్తవ్వగానే రెగ్యులర్ చిత్రీకరణ ఉంటుందని భావిస్తున్నారు. ప్రభాస్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ తో కలిసి గోపి కృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం యూరప్ లో జరగనుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ విషయమై చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*