ప్రభాస్ తర్వాతి సినిమా కి అంత బడ్జెట్ అవసరమా?

‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ మార్కెట్ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఎంత ఖర్చు పెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకంతో మన ప్రొడ్యూసర్స్ ఖర్చు పెట్టేస్తున్నారు. అంతే కాకుండా మొన్న వచ్చిన విజయ్ సినిమాకి ‘గీత గోవిందం’కి 100 కోట్ల గ్రాస్ వచ్చిందటే మన స్టార్ హీరోల సినిమాలకి ఎంత రావాలి? ఆ లెక్కలో ప్రభాస్ కి ఎంత బడ్జెట్ పెట్టాలి? అన్న లెక్కలు వేసుకుని ఖర్చు గురించి ఆలోచించకుండా ఖర్చు పెడుతున్నారు. మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న `సాహో` చిత్రం కోసం ఏకంగా రూ.250 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నట్టు స‌మాచారం.

రంగస్థలంలా……

ఇది ఇలా ఉంటె ప్రభాస్ `సాహో` చిత్రం తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? `సాహో` బడ్జెట్ మీద మరో 50 కోట్లు ఎక్కువ. అంటే ఈ సినిమాకి రూ.300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్టు వినికిడి. ఈసినిమా సెట్స్ కోసమే ఏకంగా రూ.40 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని తెలుస్తోంది. ఈసినిమా కూడా ‘రంగ‌స్థలం’ లా 1980 నేప‌థ్యంలో సాగే క‌థ అట.

అన్ని సెట్లతో…….

అందుకే అప్పుడు దృశ్యాలు..కట్టడాలు ఉండేటట్టు చూసుకుంటున్నారు. అందుకుగాను రైల్వే స్టేష‌న్‌, పోర్టు, ఎయిర్ పోర్ట్ సెట్స్ వేసే పనిలో ఉన్నారట టీం. షూటింగ్ మొత్తం ఇట‌లీలోనే సాగుతుంది. ఇప్పటికే అక్కడ కొన్ని లొకేష‌న్లను ఖ‌రారు చేసేసింది చిత్రబృందం. ప్రభాస్ కి జోడిగా పూజ నటిస్తున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.