ఒకేదారిలో ప్రభాస్, రాజమౌళి

‘బాహుబలి’ రెండు పార్ట్ ల   కోసం ప్రభాస్ అండ్ రాజమౌళి సుమారు నాలుగేళ్లు సమయాన్ని తీసుకున్నారు. తీసుకుంటే తీసుకున్నారు కానీ దేశం మొత్తం గర్వించే ఓ అద్భుతమైన సినిమాను ఇచ్చారు. ‘బాహుబలి’ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనం చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఎవరి బాటలో వారు సినిమాలు చేసుకుంటున్నారు.

ఓ కొలిక్కి వస్తోన్న సాహో..

ప్రభాస్ చాలాకాలం నుండి సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా జరగగా…రీసెంట్ గా అబుదాబి షెడ్యూల్ ను పూర్తి చేయడంతో..షూటింగ్ ఇప్పుడే ఓ కొలిక్కి చేరుకుంది. మొదట రిలీజ్ చేసిన టీజర్ పరంగా చూసుకుంటే ఇదో గ్యాంగ్ స్టర్ బేస్డ్ మూవీ అనే సంగతి అర్ధం అవుతూనే ఉంది.

గ్యాంగ్ స్టర్ కథతోనే రాజమౌళి..

అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే రాజమౌళి కూడా గ్యాంగ్ స్టర్ సబ్జెక్టునే ఎంచుకున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ అన్నాతమ్ముళ్ల పాత్రలో రూపొందుతున్న ఈ మల్టీ స్టారర్ మూవీ.. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గా.. రామ్ చరణ్ పోలీస్ గా కనిపిస్తారని.. వాళ్లిద్దరూ అన్నాదమ్ముల పాత్రలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే అటు ప్రభాస్.. ఇటు రాజమౌళి ఇద్దరు ‘బాహుబలి’ తర్వాత ఒకే తరహా కథతో వస్తున్నారు. మరి వీరిలో ఎవరు పెద్ద హిట్టు కొడతారంటారో చూద్దాం.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*