సాహో లో ప్రభాస్ పాత్ర ఏమిటో తెలిసిపోయింది..!

prabhas new look

బాహుబలిలో.. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ఇరగదీసిన ప్రభాస్ తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్నాడు. గత ఏడాది ప్రారంభమైన సాహో షూటింగ్ ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనబడడం లేదు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ని నమ్మి అంత పెద్ద ప్రాజెక్ట్ ని యువి క్రియేషన్స్ వారు చేతిలో పెడితే.. ఇంతవరకు సుజిత్ సాహోపై ఎలాంటి స్పష్టతను ఇవ్వడం లేదు. అయినా నిర్మాతలు నచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేసాక.. ఆ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమాకు డబ్బు ఖర్చు పెట్టడ అనేది సహజమే. ఇక ఈ సినిమాకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోసం బాలీవుడ్ నుండి హీరోయిన్ ని, అనేక మంది విలన్స్ ని దింపారు. దేశంలోని పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది.

అంతర్జాతీయ దొంగగా కనిపిస్తాడా..?

అయితే సాహో సినిమా అన్నప్పటి నుండి ఈ సినిమా బాహుబలి రేంజ్ లోనే ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అలాగే ఆ ఫైటింగ్ సీన్ కి ఇంత ఖర్చు పెట్టారు.. ఆ షెడ్యూల్ అంతయ్యింది అంటున్నారే తప్ప… అసలా సినిమా కథ ఏమిటి.. ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడు అనే విషయమై ఎలాంటి వార్తలు బయటికి పొక్కలేదు. తాజాగా సాహోలో ప్రభాస్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడో అనే విషయమై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే.. సాహో సినిమాలో ప్రభాస్ ఇంటర్నేషనల్ రాబర్ గా కనిపిస్తాడని ఫిలిం నగర్ టాక్. ఇంటర్నేషనల్ రాబార్ గా ప్రభాస్ అందరిని దోచేస్తాడట. మరి ఇలాంటి రోల్ చెయ్యడం అంటే.. కాస్త ఛాలెంజింగ్ తో కూడుకున్న సాహసమనే చెప్పాలి. మరి ఇంటర్నేషనల్ దొంగగా ప్రభాస్ ఎలాంటివి దోచేస్తాడో గానీ… ఈవార్త విన్నాక ప్రభాస్ ఫాన్స్ మాత్రం అబ్బా మా హీరో రాబర్ గా కనిపిస్తాడంటూ.. తెగ ఇదైపోతున్నారు.

మరో సినిమా మొదలపెట్టనున్న ప్రభాస్

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్..ఇంకా పలు బాలీవుడ్ నటులు ఈ సినిమాలో విలన్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో.. ప్రభాస్ ఈ గ్యాప్ లో జిల్ రాధాకృష్ణతో మరో సినిమాని మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా ఈ సినిమా ఈ నెలలోనే మొదలయ్యే సూచనలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*