సాహో కి బ్రేకిచ్చి మరీ.. ప్రభాస్ ఆలా చేస్తున్నాడు..!

బాహుబలి కోసం ఐదేళ్ల పాటు మరో సినిమా ఊసే ఎత్తని ప్రభాస్ ఇప్పుడు సాహో కోసం అలానే టైం వేస్ట్ చేస్తదనుకున్నారు. కానీ సాహో సెట్స్ మీదుండగానే.. జిల్ రాధాకృష్ణ తో కలిసి తన 20 వ చిత్రాన్ని నిన్నగాక మొన్ననే పట్టాలెక్కించాడు ప్రభాస్. సాహో సినిమాతో ప్రభాస్ ఇప్పటికే ఏడాదిన్నర వేస్ట్ చేసాడు. సాహో సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం.. దేశంలోని పలు భాషల్లో ఈ సినిమాని విడుదలకు ప్లాన్ చెయ్యడంతో ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా నత్తనడకన సాగుతుంది, అందులోనూ రన్ రాజా రన్ వంటి చిన్న సినిమాని చేసిన సుజిత్ ఒక్కసారిగా ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని ఇండియా వైడ్ గా పలు భాషల్లో తియ్యాలన్నా… అది కత్తి మీద సాము వంటిదే.

ఇటలీలో షూటింగ్ కు…

అందుకే ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. అయితే సాహో చిత్రం విడుదల కావడానికి చాలా టైం పట్టడంతో సాహో షూటింగ్ కంప్లీట్ అయ్యాకే ప్రభాస్ 20వ చిత్రం పట్టాలెక్కుతుందన్నారు. కానీ ప్రభాస్ 20వ చిత్రం కోసమే సాహోకే బ్రేక్ ఇచ్చేస్తున్నారట. ఈ నెల 20 నుంచి ఇట‌లీలో రాధాకృష్ణ – ప్రభాస్ కాంబో సినిమా మొద‌ల‌వుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే త‌దిత‌రుల‌పై కొన్ని స‌న్నివేశాలు ఇటలీలో తెర‌కెక్కిస్తారట .

వచ్చే సంవత్సరం రెండు సినిమాలతో…

ఇక 24వ తేదీ నుంచి ప్ర‌భాస్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడ‌ని…. రాధాకృష్ణ సినిమా ఓ షెడ్యూల్ అయ్యాకే.. సాహో షూటింగ్ తిరిగి మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. ఇక ప్రభాస్ సాహోతో పాటు రాధాకృష్ణ సినిమాని 2019లోనే విడుదల చేసే ప్లాన్ లో ఆ మూవీ మేకర్స్ ఉండడంతో.. ఇలా సాహో కొలిక్కి రాకముందే రాధాకృష్ణ మూవీని ప్రభాస్ మొదలెడుతున్నాడని అంటున్నారు. మొత్తానికి 2018 లో ప్రభాస్ సినిమా విడుదల కాకపోయినా.. 2019 లో రెండు భారీ బడ్జెట్ సినిమాలతో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చెయ్యబోతున్నాడన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*