మొదటి టీజర్ వచ్చిన ఏడాదిన్నరకి మరో టీజరా?

telugu post telugu news

బాహుబలి కోసం ఐదేళ్లు త్యాగం చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సాహో కోసం రెండేళ్లు త్యాగం చెయ్యాల్సిన పరిస్థితి. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి సీరీస్ లో ప్రభాస్ నటన అద్భుతం. ఇక ఆ సినిమా విడుదలయ్యేవరకు మరో మూవీని ఒప్పుకొని ప్రభాస్ బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు. సాహో సినిమా షూటింగ్ సుదీర్ఘంగా జరుగుతూనే ఉంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు కేవలం 40 నుండి 50 పర్శంట్ అయినట్లుగా చెబుతున్నారు. మరి ఇలాగే ఈ షూటింగ్ నత్త నడకన నడుస్తుంటే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి కూడా విడుదలవుతుందో లేదో డౌట్.

బాలీవుడ్ నుండి హీరోయిన్స్ ని విలన్స్ ని తెచ్చిన సాహో టీమ్ ఇప్పటివరకు జరిగిన షూటింగ్ కోసం 120 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తుంది. శ్రద్ద కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా కి సంబందించిన దుబాయ్ అబుదాబి షూటింగ్ తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ లోనే లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే గూఢచారిగా కనబడనున్న ప్రభాస్ సాహో లుక్ అండ్ టీజర్ కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా సెట్స్ మీదకెళ్ళకముందే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా విడుదల రోజున సాహో టీజర్ ని కంప్లీట్ చేసిన వదిలాడు సుజిత్.. మళ్ళీ అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజునాడు మరో సాహో టీజర్ ని విడుదల చేస్తారట.

మరి మొదటి టీజర్ ని గత ఏడాది ఏప్రిల్ 28 న విడుదల చేస్తే.. మళ్ళీ ఏడాదిన్నరకు అంటే అక్టోబర్ 23 న సాహో రెండో టీజర్ ని విడుదల చేస్తున్నారన్నమాట. ఇక సాహో సినిమా ని కూడా 2019 ఏప్రిల్ 28 న విడుదల చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి సినిమా గత ఏడాది ఏప్రిల్ 28 నే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరి మళ్ళీ అదే సెంటిమెంట్ తో ప్రభాస్ సాహో కూడా 2019 ఏప్రిల్ 28 న విడుదల కావొచ్చంటున్నారు. ఇక ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీ ఆగష్టు ఫస్ట్ వీక్ లో సెట్స్ మీదకెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*