రిలీజ్ పై ఇంకా క్లారిటీ లేదు

telugu post telugu news

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన తర్వాత సినిమా ‘సాహో’ ను ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం..హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్ గా దుబాయ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది.

ఇక తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో దాదాపు సినిమాలో నటించే నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ త్వరగా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు పంపించాలని చూస్తున్నారు టీం. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ‘సాహో’ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘సాహో’ టీం మాత్రం రిలీజ్ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.

ఇక ఇదే రేంజ్ లో రజిని 2.0 సినిమా రిలీజ్ ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా రీసెంట్ గా అనౌన్స్ చేసాడు డైరెక్టర్ శంకర్. కానీ ‘సాహో’ చిత్రం మాత్రం ఈ ఏడాది చివరిలోగా వస్తుందనే మాట యూనిట్ నుంచి రావడం లేదు. పోనీ సంక్రాంతికి అనుకుంటే ఆ రేస్ లో చాలా సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో మేకర్స్ కే తెలియాలి. మరీ ఇంత లేట్ అయితే ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను పటించుకోటం మానేస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*