మార్కెట్లో ప్రభాస్ ‘సాహో’ షూటింగ్

రామోజీ ఫిల్మ్‌ సిటీలో బాహుబ‌లి సినిమా తీసేట‌ప్పుడు పెద్ద‌యెత్తున సంద‌డి క‌నిపించేది. వేల మంది న‌టులు, వంద‌ల మంది టెక్నీషియ‌న్ల‌తో లొకేష‌న్ ప్రాంత‌మంతా కిక్కిరిసిపోయేది. ఆ సినిమా త‌ర్వాత ఆ రేంజ్ షూటింగ్ మ‌ళ్లీ అక్క‌డ జ‌ర‌గలేద‌ట‌. అయితే ప్ర‌భాసే మ‌రోసారి ఫిల్మ్‌ సిటీలో అలాంటి వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చాడ‌ట‌. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న `సాహో` షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జ‌రుగుతోంది. సుమారు 300 కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం అక్క‌డ భారీ సెట్లు వేశారు. అందులో ఒక‌టి మార్కెట్ సెట్టు. ప్ర‌స్తుతం అక్క‌డే చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. దాదాపుగా రెండు నెల‌ల‌ పాటు జ‌రిగే ఈ షెడ్యూల్ కోసం పెద్ద‌యెత్తున ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలిసింది.

బడ్జెట్ గురించి ఆలోచించకుండా…

బాహుబ‌లి స‌మ‌యంలో ఉన్న న‌టులు, టెక్నీషియ‌న్ల‌ని మించిపోయేలా అక్క‌డ సంద‌డి క‌నిపిస్తోంద‌ట‌. వాళ్లంద‌రికీ కూడా అక్కడే బ‌స ఏర్పాట్లు చేశార‌ట‌. బాహుబ‌లికి బ‌డ్జెట్ లిమిట్‌లో ఉండేది. ఆ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ మార్కెట్టు ఓ రేంజ్ లో పెరిగింది. దీంతో బ‌డ్జెట్ ప‌రిమితులంటూ లేకుండా సినిమాని తీస్తున్నారు. ఈ చిత్రం ప‌లు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో స‌న్నివేశాల‌తో పాటు, కొన్ని భారీ యాక్ష‌న్ ఎపిసోడ్లు కూడా తీయ‌నున్న‌ట్టు స‌మాచారం. హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ చాలా రోజుల పాటు హైద‌రాబాద్‌లోనే గ‌డ‌ప‌నుంద‌ని స‌మాచారం. సాహో చిత్రాన్ని సుజీత్ తెర‌కెక్కిస్తుండ‌గా, యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. ఈ ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*