ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తిన ప్రముఖ విలన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డార్లింగ్ అని అందరు ముద్దుగా పిలుచుకునే హీరో ప్రభాస్. ఎందుకంటే ప్రభాస్ చాలా జెన్యూన్ పర్సన్ అని..అందరితో సరదాగా ఉంటాడని చాలా మంది హీరోలు.. డైరెక్టలు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. ‘బాహుబలి’ సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయిన ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు.

యాక్షన్ సీన్స్……

ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీన్స్ ను అబుదాబిలో ప్రభాస్ .. విలన్ నీల్ నితిన్ ముఖేశ్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ గురించి నీల్ నితిన్ ముఖేశ్ స్పందించాడు. ” నా దృష్టిలో ప్రభాస్ నేషనల్ డార్లింగ్ అని.. అయన అందరితో ఎంతో ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడతారని..ప్రతి ఒక్కరినీ వెంటనే తన ప్రేమలో పడేసేలా చేస్తుకుంటాడని చెప్పారు”.

సరదాగా…..

“రీసెంట్ గా అయన నా ఫామిలీ మెంబెర్స్ తో చనువుగా గడిపిన తీరు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది” అంటూ తాను తన భార్య ప్రభాస్ తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు..తమిళ్.. హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు యూవీ క్రియేషన్స్ వారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*