బరువు తగ్గనున్న ప్రభాస్..!

సాహో

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ చిత్రంతో ఫుల్ బిజీ అయ్యిపోయాడు. ఈ సినిమాకి 100 కోట్లు పైనే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడు.

10 కిలోల బరువు తగ్గనున్నాడా..?

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నాడు. ఈ సినిమా ఈ నెల 6న ఓపెనింగ్ కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. అందుకే ప్రభాస్ ఆ పాత్ర కోసం ఏకంగా 10 కిలోల బరువు తగ్గనున్నాడట.

ఇద్దరు హీరోయిన్లు…

‘బాహుబలి’ కోసం పెరిగిన బరువుతో ‘సాహో’ సినిమాలో కూడా కంటిన్యూ అయ్యాడు ప్రభాస్. అయితే ఇప్పుడు మరీ అంత బరువు కాకుండా స్లిమ్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. మరో హీరోయిన్ కోసం రాశి ఖన్నా, రకుల్ పేర్లు వినిపిస్తున్నాయి. మరీ ప్రభాస్ పక్కన నటించే ఆ లక్కీ గర్ల్ ఎవరో చూడాలి.

 

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*