ప్రగ్యా అందాలు చూడతరమా..!

బక్క పల్చని అందాలు… గ్లామర్ షోకి అడ్డు చెప్పని మనస్తత్వం… అందాల ఆరబోతకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి గ్లామర్ భామ ప్రగ్యా జైస్వాల్ కి. కంచె, గుంటూరోడు సినిమాల్లో అమ్మడు అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉండేది. ఆఖరుకి గత ఏడాది జయ జానకి నాయకలో వేసిన చిన్నపాటి రోల్ లో కూడా అందాల ఆరాబోతలో ఏ మాత్రం తగ్గలేదు. పొట్టి నిక్కర్లతో… ఘాటైన అందాలతో చెలరేగిపోయింది. ఇక కృష్ణ వంశీ నక్షత్రం సినిమాలో పోలీస్, గ్లామర్ డ్రెస్సులతో అదరగొట్టిన ప్రగ్యా జైస్వాల్… బీచ్ సాంగ్ లో మాత్రం విపరీతమైన గ్లామర్ షో చేసింది.

సైరాలో మంచి అవకాశం..!

పాపం స్టార్ హీరోల పక్కన అవకాశాల మాట అటుంచి… ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లోనూ ప్రగ్యాకి అవకాశాలు ఇచ్చే నాధుడే లేదు. అయితే చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో మాత్రం ప్రగ్యా జైస్వాల్ కి ఒక పాత్ర వచ్చిందనేది ఓల్డ్ న్యూస్. అయితే ప్రగ్యా జైస్వాల్ కి సైరాలో అదిరిపోయే రోల్ ఇచ్చారని.. ఆ పాత్రతో ప్రగ్యాకి మంచి పేరొస్తుందని చెబుతున్నారు. ఆ విషయం అలా ఉంచితే ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో చుస్తే మాత్రం మతి పోవాల్సిందే. ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్ లో కొన్ని ఫొటోస్ ని విడతల వారీగా సోషల్ మీడియాలో వదులుతూ కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోతుంది. మొన్నటికి మొన్న బ్లాక్ డ్రెస్సులో మతిపోగొట్టిన ప్రగ్యా.. తాజాగా అందమైన పూల గౌన్‌లో అందమైన పోజిచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*