వామ్మో ఒక యాడ్ కి అంతా?

కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ అయిన మ‌లయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్.. ఆ హైప్ తో యాడ్స్ కూడా చేస్తుంది. తను నటించిన సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే స్టార్ అయిపోయిన ప్రియా… యాడ్స్ కు మొన్నటివరకు 7ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్ తీసుకోగా… ఇప్పుడు ఒక్కో యాడ్ కి కోటి రూపాయల పారతోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పలు భాషల్లో స్టార్ హీరోల సరసన కూడా నటిస్తోంది ప్రియా.

ఒక్క యాడ్ కు కోటి…

రీసెంట్ గా ప్రియా ఓ సంస్థ యాడ్ లో యాక్ట్ చేసింది. అందుకుగాను ఆమె అక్షరాలా కోటి రూపాయ‌లు తీసుకుందట. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్ర‌తినిధులు మాట్లాడుతూ… వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన ప్రియాకు మేము యాడ్ కోసం కోటి రూపాయిలు ఇచ్చాము. కొత్తగా వచ్చిన ఏ హీరోయిన్స్ కు ఈ త‌ర‌హా పారితోషికం ఉండ‌దు. కానీ ప్రియాకి ఇచ్చాము అని ఆనందంగా చెబుతున్నారు.

దీపం ఉండగానే…

19 ఏళ్లకే ఇంత సంపాదిస్తుందేంటి అని ఇప్పుడున్న హీరోయిన్స్ ఆశ్చర్యపోతున్నారు. సంపాదన.. పేరుప్ర‌ఖ్యాత‌లతో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్కబెడుతుంది. ఇక ఆమె బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించే సింహా చిత్రంలో రణ్‌వీర్ సింగ్ సరసన నటిస్తున్నది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*