ముంబై నుండి సామాను సర్దేసినట్లేనా?

బాలీవుడ్ లో ఒక వెలుగుతున్న టైం లోనే హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోయిన ప్రియంకా చోప్రా అక్కడ మాత్రం సక్సెస్ కాలేదు. కానీ అమ్మడుకి హాలీవుడ్ అవకాశాలు మాత్రం దండిగానే వస్తున్నాయి. అయితే ఈ మధ్యన ప్రియాంక చోప్రా నటించిన సినిమాలతో కన్నా ఎక్కువగా ఆమె బాయ్ ఫ్రెండ్ విషయంలో తెగ హైలెట్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని గోవా లో బర్త్ డే జరుపుకున్న ఈ సుందరి అతడితో ఎంగేజ్మెంట్ చేసుకోబోతుందని… త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నా ప్రియాంక మాత్రం పెదవి విప్పడం లేదు.

ముంబై ఎయిర్ పోర్టులో సందడి…

అయితే హాలీవుడ్ లో అడుగుపెట్టినప్పటి నుండి.. ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్న ప్రియాంక కొద్దీ రోజులు మాత్రమే ముంబైలో గడుపుతుంది. గత కొన్ని రోజులుగా ముంబై లో బాయ్ ఫ్రెండ్ నిక్ జొనస్ తో కలిసి లవ్ బర్డ్స్ లా తిరిగిన ప్రియాంక ఇప్పుడు ముంబైని వేదిలేసి దుబాయ్ ఎగిరిపోతుంది. గురువారం రాత్రి ముఖేష్ అంబానీ కొడుకు ఎంగేజ్మెంట్ పార్టీలో హల్ చల్ చేసిన ప్రియాంక చోప్రా జంట ఈ రోజు ఉదయం ముంబై ఎయిర్‌పోర్టు నుండి దుబాయ్ కి దుకాణం సర్ధేసినట్టుగా వార్తలొస్తున్నాయి.

త్వరలోనే పెళ్లి…

మరి ప్రియాంక ఆమె బాయ్ ఫ్రెండ్ నిక్ జొనస్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రేమతో ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. మరి నిజంగా వారు దుబాయ్ కి షాపింగ్ చెయ్యడానికి వెళ్ళారా..? లేదా అమెరికాకి తిరిగి వెళ్లిపోయారా ? అనేది మాత్రం ఫుల్ సస్పెన్స్. ఏది ఏమైనా ఈ జంట అతి త్వరలోనే పెళ్లితో ఒక్కటవుతుందని.. బి టౌన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*