హాలీవుడ్ కి వెళ్లాక క్రేజ్ తగ్గిందిగా..!

బాలీవుడ్ లో టాప్ మోస్ట్ లో దూసుకుపోతున్న హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ మీద మోజుతో అమెరికాకి చెక్కేసింది. మరి ప్రయాంకకి హాలీవుడ్ అస్సలు కలిసి రాలేదు. బాలీవుడ్ లో పీక్ స్టేజ్ లో ఉండగా హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రా కి హాలీవుడ్ మూవీ బేవాచ్ ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ సినిమాలో ప్రియాంక వేసిన బికినిలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ప్రియాంక నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తర్వాత హాలీవుడ్ లో బిజీ అవుదామనుకున్న ప్రియాంకకి మళ్లీ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన భరత్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రియాంక ఈ సినిమా కోసం అత్యధికంగా 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుంది అని ప్రచారం జరిగింది.

అంత కాదంట…

ఇప్పటివరకు దీపికా పదుకొనే పద్మావత్ చిత్రానికి గానూ బాలీవుడ్ హీరోయిన్లలోనే టాప్ మోస్ట్ లో 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది. తర్వాత మళ్లీ 11 కోట్ల తో కంగనా రౌనత్ సెకండ్ ప్లేస్ ఆక్రమించింది. అయితే ప్రియాంక కూడా భరత్ తో దీపికా సరసన చేరిందని బాగానే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ముంబై కి చెందిన ఒక ప్రముఖ పత్రిక ప్రియాంక ఈ సినిమా కోసం కేవలం 6.50 కోట్లు మాత్రమే తీసుకుంటుందని రాసింది. మరి ఈ లెక్కన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నవాళ్లలో దీపికా, కంగన తర్వాత ప్రియాంక భరత్ రెమ్యునరేషన్ ఆరున్నర కోట్లతో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు.

హాలీవుడ్ తెచ్చిన చేటు…

అయితే ప్రియాంక బాలీవుడ్ లోనే కొనసాగితే ఈ సినిమాకి రూ.12 కోట్లు అందుకునేదని… ఆమె హాలీవుడ్ కి వెళ్లిపోయిన కారణంగానే బాలీవుడ్ లో ఆమె క్రేజ్ తగ్గి ఇలా ఆరున్నర కోట్లకి సరిపెట్టుకోవాల్సి వస్తుందని బీ టౌన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన ప్రియుడి తో కలిసి బ్రెజిల్ నుండి తిరిగి అమెరికాకి వెళ్లిపోయింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ ని ప్రియాంక త్వరలోనే వివాహమాడబోతుందనే హాట్ టాపిక్ గత నెల రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*