‘పెట్టా’కు తెలుగులో కష్టాలు తప్పవా..?

rajanikanth petta

గత కొనేళ్ల నుండి నందమూరి బాలకృష్ణ ప్రతీ సంక్రాంతి సీజన్ లో తన సినిమా ఉండేటట్లు చూసుకుంటున్నారు. పోయిన సంక్రాంతికి ‘జై సింహ’తో వచ్చి పర్లేదు అనిపించుకున్న బాలయ్య ఈసారి కూడా ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో మన ముందుకు రానున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకీ – వరుణ్ ల ‘ఎఫ్‌ 2’ తెలుగులో రెడీగా ఉన్నాయి. అలానే తమిళ డబ్ మూవీ ‘పెట్టా’ కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నారు.

థియేటర్లైనా దొరుకుతాయా..?

కానీ ఇంతవరకు ‘పెట్టా’ తెలుగు రైట్స్ ఎవరూ తీసుకోలేదు. పోటీ బాగా ఉండటంతో ఆ ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్‌ ఒక అడుగు ముందుకేసి ‘పెట్టా’ హక్కుల తీసుకున్నట్టు సమాచారం. తమిళంలో ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవుతుండంతో… తెలుగులో కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని ప్లాన్ వేస్తున్నాడు కళ్యాణ్. అసలే తెలుగులో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ‘పెట్టా’ కు థియేటర్లు దొరికే అవకాశాలు తక్కువని ట్రేడ్‌ అంటోంది. మరి కళ్యాణ్ ఏం చేస్తాడో చూడాలి. ‘పెట్టా’ టీజర్ అంచనాలు పెంచింది. యంగ్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*