ఎన్టీఆర్ బయోపిక్ ను పూరి డైరెక్ట్ చేయనున్నాడా?
సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా 'ఎన్టీఆర్' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ ఎన్టీఆర్ పాత్ర తానే పోషిస్తున్నాడు. దర్శకత్వం బాధ్యతలు తేజకి అప్పగించాడు. లేటెస్ట్ ఈ సినిమా ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు.
మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అన్న టైంలో దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్నారు. దీంతో, ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, వైవీయస్ చౌదరి, క్రిష్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. వీరు ఎవరు కాదు బాలకృష్ణనే స్వయంగా దర్శకత్వం చేయనున్నాడని మరో టాక్ బయటికి వచ్చింది. గతంలోనే బాలయ్య 'నర్తనశాల' సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం అర్థాంతరంగా ఆగిపోయింది.
మళ్లీ ఇప్పుడు తెరపైకి మరో డైరెక్టర్ పేరు వచ్చింది. బాలయ్యతో పైసా వసూల్ సినిమా తీసిన పూరి 'ఎన్టీఆర్' సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని గట్టి టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పటివరకైతే చాలా పేర్లు బయటికి వచ్చాయి కానీ బాలయ్య ఎవరిని ఫైనలైజ్ చేస్తారో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.