వీరిద్దరి కాంబోలో సినిమా ఫైనల్..?

Puri film with ram

ప్రస్తుతం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిస్థితి ఏమి అంతగా బాగోలేదు. అతను చేసే సినిమాలు చాలా రెగ్యులర్ గా ఉంటున్నాయని… స్క్రీన్ ప్లే లో కొత్తగా ఏమీ ఉండట్లేదని ప్రేక్షకులు తన సినిమాలని రిజక్ట్ చేస్తున్నారు. అయితే పూరీ అవి ఏమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. రీసెంట్ గా తన కొడుకుని హీరోగా పెట్టి చేసిన ‘మెహబూబా’ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో పూరి కొంచం గ్యాప్ తీసుకున్నాడు.

రామ్ తో పూరీ సినిమా

ఈ నేపథ్యంలో తాజాగా ఫిలింనగర్ లో ఓ రూమర్ హల్ చల్ చేస్తుంది. పూరీ – హీరో రామ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన యాక్షన్ తో ఈ సినిమా రూపొందబోతుందట. అటు రామ్ పరిస్థితి కూడా అంతగా ఏమీ బాగోలేదు. అతని సినిమాలు కూడా నిరాశపరుస్తున్నాయి. రీసెంట్ గా ‘హలో గురు ప్రేమ కోసమే’ కొంచెం పర్లేదు అనిపించుకున్నా వసూళ్లు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే సినీ లవర్స్ కి కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కుమారుడి సినిమాతో పూరీ బిజీ…

ఈ సినిమాను పూరీ సొంత బ్యానర్, స్రవంతి మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికార ప్రకటన రానుంది. ఇక మరో వైపున పూరీ తన తనయుడు ఆకాశ్ హీరోగా చేయనున్న సినిమాకి సంబంధించిన పనులను కూడా చక్కబెడుతూ ఉన్నాడు. అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఇది కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*