ప్రభాస్ కి రహమాన్ ని సెట్ చేశారు..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “సాహో” చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే తర్వాతి చిత్రాన్ని లైన్ పెట్టేసాడు ప్రభాస్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ 20వ చిత్రం చేస్తున్నాడు. దానికి సంబంధించి పూజ కార్యక్రమాలు నిన్న జరిగాయి. ఇందులో ప్రభాస్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

అమిత్ త్రివేది అనుకున్నా…

ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ ని తీసుకోనున్నారు మూవీ యూనిట్. మొదట ఈ సినిమాలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనకి బదులుగా ఏ.ఆర్.రహమాన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. రహమాన్ ని తీసుకుందాం అనుకోటానికి కారణం అమిత్ ప్రస్తుతం “సైరా” సినిమాతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా ఆయన బాలీవుడ్ లో కొన్ని సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. దీంతో డేట్స్ క్లాష్ అవుతాయి అనుకొని ఏ.ఆర్.రహమాన్ ను తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారట. అయితే ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇంకా ఈ సినిమా పూర్తిగా యూరోప్ నేపథ్యంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కనుంది. ఈ మూవీ కోసం ప్రభాస్ 10 కిలోలు బరువు తగ్గనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.