ఆకట్టుకుంటున్న ’లవర్’ ఫస్ట్ లుక్

రాజ్ తరుణ్ - rajtarun

తొలి చిత్రం `ఊయ్యాల జంపాల‌`తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యం లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై `ల‌వ‌ర్‌` సినిమాలో న‌టిస్తున్నారు. `అలా ఎలా?` వంటి సూప‌ర్ హిట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ఆక‌ట్ట‌కున్న ద‌ర్శ‌కుడు అనీశ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. శిరీశ్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌. ప్రేమ‌లోని స‌రికొత్త కోణాన్ని ట‌చ్ చేస్తూ అనీశ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌కి ఆడియ‌న్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా షూటింగ్ అంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సాంకేతిక వర్గం….

కెమెరా: స‌మీర్ రెడ్డి, మ్యూజిక్‌: అంకిత్ తివారి, రిషి రిచ్‌, అర్కో, త‌నీశ్ బాగ్చి, సాయికార్తీక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌: జె.బి, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, స్టంట్స్‌: విజ‌య్‌, వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి, నిర్మాత: హ‌ర్షిత్ రెడ్డి, ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అనీశ్ కృష్ణ‌.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*