సైలెంట్ గా నిశ్చితార్థం చేసేసిన రాజమౌళి..!

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల విషయంలో ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తాడో కొడుకు ఎంగేజ్మెంట్ విషయంలో అంతే సీక్రెట్ ని మెయింటైన్ చేసాడు. తన కొడుకు కార్తికేయ ఎంగేజ్మెంట్ చేసేసి అందరికీ షాకిచ్చాడు. రాజమౌళి దగ్గరే పనిచేసే కార్తికేయ టాలీవుడ్ లో అందరికీ సన్నిహితుడే. అయితే కార్తికేయ రాజమౌళి సినిమాల విషయంలో అన్ని తానై వ్యవహరిస్తాడు. అలాగే ఇతర వ్యాపారాల్లో కూడా కార్తికేయ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే కొడుకు కార్తికేయ ఎంగేజ్మెంట్ ని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేశాడు. నిన్న ఒక్కరోజే సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో రాజమౌళి కొడుకు కార్తికేయ నిశ్చితార్ధం అంటూ వార్తలు రావడం.. రాత్రికల్లా కార్తికేయ ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయటికి రావడంతో అందరికీ షాకిచ్చాడు.

కొద్దిమంది సన్నిహితుల మధ్య…

ఇంతకీ కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి… రాజమౌళి కోడలెవరో కాదు టాలీవుడ్ హీరో కమ్ విలన్ జగపతి బాబు అన్న కూతురు పూజని రాజమౌళి తన కొడుక్కి జోడిగా ఎంపిక చెయ్యడం, ఇద్దరికీ ఘనంగా నిశ్చితార్ధం చేసెయ్యడం జరిగిపోయాయి. అయితే జగపతి బాబు అన్న కూతురు పూజ నిర్మాత రాజేంద్ర ప్రసాద్ మనవరాలు మాత్రమే కాదు.. ఆమె ఒక మంచి సింగర్ కూడా. ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఆమె భక్తి ఆల్బమ్స్ చాలానే విడుదలయ్యాయి. మంచి సింగర్ మాత్రమే కాదు… ఉన్నత చదువు కూడా అభ్యసించింది. ఇక నిన్న రాత్రి కార్తికేయ – పూజ నిశ్చితార్ధం కొద్ది మంది సన్నిహితుల మధ్య నగరంలో వైభవంగా జరిగింది. ఇక ఆ నిశ్చితార్ధం లో అక్కినేని అఖిల్, బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ వంటి వారు పాల్గొన్న విషయం బయటికి లీకైన ఫొటోల ద్వారానే తెలిసింది. అయితే కార్తికేయ – పూజల జోడి చాలా బాగుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*