యూరప్ వెళ్లనున్న సూపర్ స్టార్..!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 165వ చిత్రం చేస్తున్నాడు. అతను లేటెస్ట్ గా చేసిన ‘కాలా’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో  సినిమా హిట్ అవ్వాలని రజనీతో పాటు ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యిపోయాడు రజనీ. కొన్ని నెలలు కింద స్టార్ట్ అయినా ఈ షూటింగ్ ఇటీవలే డార్జిలింగ్, చెన్నైలో మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యూల్ యూరప్ లో జరగబోతుందట. నలభై రోజులు పాటు జరుగుతున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను చిత్రీకరించనున్నారు.

రజనీ డ్యూయల్ రోల్

ఇందులో రజనీ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. “పిజ్జా” ఫేం కార్తి సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, బాబి సింహ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నవజుద్దిన్ సిద్దికి ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్స్ గా మెగా ఆకాష్, త్రిష్ కనిపించనున్నారు.