ఆశలన్నీ ఆ సినిమా పైనే..!

Rajinikanth fans hopes on Petta

ఒక్కప్పుడు రజినీకాంత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ ఎగబడి కొనుకునే వారు. కానీ కొన్నేళ్ల నుండి రజినీకి ఎందుకో కలిసి రావడం లేదు. చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతున్నాయి. తమిళంలో కూడా రజినీ సినిమాలని ఆదరించలేకపోతున్నారు అక్కడి జనాలు. రీసెంట్ గా వచ్చిన 2.ఓ కొంచం పర్లేదు అనిపించుకుంటుంది. రజినీ ఫ్యాన్స్ కి ఇది సరిపోలేదు.. ఇంకా ఏదో కావాలి అంటున్నారు. సంక్రాంతికి కార్తీ సుబ్బరాజు డైరెక్షన్ లో ‘పెట్టా’ అనే మూవీ వస్తుంది. ఇందులో రజినీ ఎన్నడూ లేని విధంగా చాలా యంగ్ గా.. కొత్త లుక్ తో మనల్ని ఎంటర్టైన్ చేయనున్నాడు.

పెద్ద స్టార్స్ కూడా ఉండటంతో…

రజినీ లుక్ తో పాటు మొన్న రిలీజ్ అయిన ‘మరణ’ మాస్‌ పాట అంతటా ఊపేస్తోంది. ఈ పాట యూట్యూబ్ లో రెండు రోజుల్లో 70 లక్షల వ్యూస్‌ తెచ్చుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాలో రజినీతోనే కాకుండా.. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్‌, సిమ్రాన్.. లాంటి పెద్ద స్టార్స్ నటించడంతో వారి వల్ల అదనపు ఆకర్షణ వచ్చింది. డైరెక్టర్ కార్తీక్ వెరైటీ కథాంశాలతో అలరిస్తూ ఉంటాడు కనుక అతనిపై కూడా నమ్మకం బాగానే కుదిరింది. కచ్చితంగా ఈ సినిమా రజినీకు ప్లస్ అవుతుందని… మళ్లీ అతను తిరిగి ఫామ్ లోకి వస్తాడు అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*