రజనీ ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడా..?

రజినీకాంత్ కి సూపర్ స్టార్ అనే స్టార్ డం తెచ్చిపెట్టి అభిమానులను రెండింతలు పెంచిన సినిమాలు ఆయన కెరీర్ లో చాలానే ఉన్నాయి. అందులో నరసింహ, బాషా లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా రజినీకాంత్ బాషాకి సీక్వెల్ చేయబోతున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. కానీ రజినీకాంత్ అలాంటి క్లాసికల్ మూవీస్ ని టచ్ చెయ్యడం కరెక్ట్ కాదని అన్నాడు. దాంతో బాషా సీక్వెల్ కి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఇప్పుడు రజినీకాంత్ నరసింహకి సీక్వెల్ చెయ్యబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి కెఎస్ రవికుమార్ – రజినీకాంత్ కలయికలో వచ్చిన నరసింహ సినిమా అనేక రికార్డులను కోల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆసక్తికరమైన కుటుంబ కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కొట్టింది.

వరుస ఫ్లాప్ లలో దర్శకుడు…

మరి అప్పట్లో నరసింహ సినిమాలో రజినీకాంత్ కన్నా ఎక్కువగా నీలాంబరి పాత్రధారి అయిన రమ్యకృష్ణ పాత్రకే ఎక్కువ స్కోప్ అండ్ పవర్ ఉండడంతో… రజినీ అభిమానులు రమ్యకృష్ణ ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుకోవడం లాంటివి కూడా చేశారు. మరి అలాంటి సినిమాకి ఇప్పుడు మళ్లీ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సీక్వెల్ రాబోతుందని న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా ప్రచారం జరుగుతుంది. మరి ప్రస్తుతం కెఎస్ రవికుమార్ డైరెక్టర్ గా అయనకు అంతగా పేరు లేదు. అవుట్ డేటెడ్ దర్శకుడిగా కెఎస్ రవికుమార్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో బాలయ్య తో తెలుగులో తీసిన జై సింహ యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది.

ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు

ప్రస్తుతం రజినీకాంత్ తో చర్చలు జరిపి నరసింహ 2 కి ఒకే చేయించుకున్న కెఎస్ రవికుమార్ నరసింహ సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని… రజినీకాంత్ 161 వ సినిమాగా ఈ నరసింహ 2 ఉండబోతుందని.. కార్తీక్ సుబ్బరాజు సినిమా పూర్తవగానే సూపర్ స్టార్ రజినీతో ఈ సినిమాని కెఎస్ రవికుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎలాగూ రజినీకాంత్ ఇప్పుడు సినిమాల మీద సినిమాలు చేస్తూ ఈ ఏడాది నుండి ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే కాలా సినిమా విడుదల కాగా.. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 2.ఓ విడుదలకు సిద్దమవుతుంది. ఇక వచ్చే ఏడాది కార్తీక్ సుబ్బరాజు మూవీ తో పాటుగా ఈ కెఎస్ రవికుమార్ తో చేసే నరసింహ సీక్వెల్ ఉండేలా రజినీ ప్లాన్ చేస్తున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.