హమ్మయ్య 2.0 టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు!

రజనికాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకేక్కిస్తున చిత్రం రోబో 2.0 . ఈ సినిమా కోసం ఎదురు చూసి చూసి జనాలు విసుగెత్తిపోయి దాని గురించి మాట్లాడటమే మానేశారు. ఈ సినిమా మేకర్స్ కూడా దీనిపై స్పందించట్లేదు. వీరు స్పందించకపోవడంతో ఈ సినిమాపై రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ‘2.0’ గురించి ఒక కొత్త రూమర్ బయటికి వచ్చింది.

ఐసీఎల్ మ్యాచ్ లో టీజర్…

ఈ చిత్రం టీజర్ ను ఇంకో వారంలో రిలీజ్ చేయనున్నారట. ముంబయిలోని వాంఖడె స్టేడియంలో వచ్చే ఆదివారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టైం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో ఇలా ఐపీఎల్ మ్యాచ్‌ల మధ్యలో సినిమా ప్రమోషన్లు చేయడం చూసాం. కానీ రోబో ‘2.0’ సంగతి వేరు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. ఇలాంటి సినిమా టీజర్‌ను ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా రిలీజ్ చేస్తే మోతెక్కిపోతుంది. ఐడియా బాగానే ఉంది. ఈ వార్త విన్న రోబో ఫ్యాన్స్ లో కొత్త జోష్ వచ్చింది. చూద్దాం టీజర్ తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*