కాలా ఫ్లాప్ కాదు…!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే గత సినిమాల టాక్ తో సంబంధం ఉండదు.. ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ ఉంటాయి. తాజాగా రజినీకాంత్ కాలా సినిమా కూడా భారీ అంచనాలతోనే జూన్ 7 న థియేటర్స్ లోకి దిగింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కాలా కి భారీ ఓపెనింగ్స్ కాదు కదా… కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. కానీ రజినీకాంత్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళనాట మాత్రం అదరగోట్టే కలెక్షన్స్ కాలా సినిమా రాబట్టింది. కేవలం మూడు రోజులలోనే కాలా సినిమా 100 కోట్ల క్లబ్బులోకి చేరిపోయింది. అయితే కాలా సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా… కలెక్షన్స్ బాగున్నాయంటున్నారు.

మలేషియాలోనూ దూకుడు…

అందులోనూ తమిళనాట, ఓవర్సీస్ లో కాలా సినిమా కలెక్షన్స్ అదుర్స్ అంట. తమిళనాట కాలా కలెక్షన్స్ సూపర్. ఒక్క చెన్నైలోనే ఈ సినిమా తొలివారంలో 8.24 కోట్లను కొల్లగొట్టి కాలా తో రజినికాంత్ తన సత్తా చాటాడు. ఇక కోలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ కాలా సినిమా తన దూకుడును కొనసాగిస్తుంది. అమెరికాలో కాలా ఫస్ట్ వీక్ లో 13.5 కోట్లను వసూలు చేస్తే… రజినీకాంత్ కి పిచ్చ అభిమానులున్న మలేషియాలో కాలా సినిమా 7.61 కోట్లను రాబట్టింది. మలేషియాలో ఏ హీరోకి లేని క్రేజ్ రజినీకాంత్ కి ఉన్న కారణంగానే కాలా సినిమా కి అక్కడ ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటున్నారు.

రజినీకాంత్ కాకుండా ఉంటే…

ఇక కాలా కి యావరేజ్ టాక్ వచ్చినా… రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ కారణంగానే కాలా సినిమా కి కలెక్షన్స్ ఇలా పరుగులు పెడుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. మరి కాలా సినిమా ని ఈ సినిమా దర్శకుడు రంజిత్ పా ఏ హీరోతో చేసినా కాలా అట్టర్ ప్లాప్ అయ్యుండేదని.. రంజిత్ పా కేవలం రజినీని నమ్ముకుని అదృష్టాన్ని పట్టేసాడంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*