సూపర్ స్టార్ పక్కన రకుల్

rakul career in tamil

తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవించిన తర్వాత తన లక్ ను కోలీవుడ్ లోను.. బాలీవుడ్ లోను టెస్ట్ చేసుకోడానికి వెళ్ళింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ రెండు ఇండస్ట్రీస్ లో సినిమాల మీద సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అక్కడ సినిమాల్లో బిజీ అవ్వడం ఆమె తెలుగులో ఒక్క సినిమాకి కూడా సైన్ చేయకపోవడానికి కారణం.

అయితే మళ్లీ తెలుగులోకి ఎంట్రీ అవ్వబోతుంది రకుల్. అది కూడా సూపర్ స్టార్ సినిమాతో. గత కొద్ది రోజులు నుండి టాలీవుడ్ లో రకుల్ మళ్లీ ‘స్పైడర్’ తర్వాత మహేష్ సరసన నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 25వ సినిమా చేస్తున్న మహేష్…ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు.

అందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా రకుల్ ఫైనల్ అయిపోయిందని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఆగక తప్పదు. ఏమైనా రకుల్ పాపా లక్కీ అని చెప్పాలి. ఆమె ఏ ఇండస్ట్రీకి వెళ్లిన ఆమెకు సినిమాలు వచ్చి పడుతున్నాయి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*