పూజ ని చూసి రకుల్ జెలస్ ఫీల్ అవుతుందా..?

గత ఏడాది వరకు టాలీవుడ్ టాప్ ఛైర్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూర్చుంది. అతి తక్కువ టైం లో హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా రకుల్ చేసిన సినిమాలు మరే హీరోయిన్ చేసుండదు. చిన్న హీరోలు, స్టార్ హీరోలతోనూ రకుల్ ప్రీత్ సింగ్ వరసబెట్టి నటించేసింది. ఇక తెలుగు, తమిళంలోనూ రకుల్ ప్రీత్ సింగ్ బిజీ తారగా వెలుగొందుతూ… టాప్ ఛైర్ లో మరో ఐదారేళ్లు ఉంటుందన్న టైం లో రకుల్ ప్రీత్… మహేష్ తో కలిసి మొదటిసారి నటించిన స్పైడర్ దెబ్బకి అటు తమిళం ఆశలు, ఇటు తెలుగు అవకాశాలు కూడా గల్లంతయ్యాయి. ఏకంగా ఏడెనిమిది నెలలు సినిమాల్లేక ఖాళీ అయ్యింది. మధ్యలో బాలీవుడ్ మీద ఓ కన్నేసిన ఈ భామకు అక్కడా నిరాశే కలిగింది. ఇక జీరో సైజు అన్నట్టుగా బాగా డైటింగ్, జిమ్ చేసిన రకుల్ ఇప్పుడు టాలీవుడ్ లో నాగ చైతన్య పక్కన, తమిళంలో సూర్య పక్కన నటిస్తుంది.

తన స్థానంలోకి రావడంతో…

అయితే రకుల్ ప్రీత్ డల్ అయిన టైం లోనే టాలీవుడ్ టాప్ ఛైర్ కి మరో హీరోయిన్ దగ్గరైంది. డీజే దువ్వాడ జగన్నాధం సినిమాతో అనూహ్యంగా లైం టైం లోకి దూసుకొచ్చిన పూజ హెగ్డే ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఎలా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల మీద అవకాశాలతో బిజీ అయ్యిందో సేమ్ అలానే పూజ హెగ్డే కూడా మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలతో ఒక్కసారిగా బిజీ అయింది. మరి ఒకవిధంగా చెప్పాలి అంటే రకుల్ స్థానాన్ని పూజ హెగ్డే పట్టేసింది. ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిన పూజ హెగ్డే ని చూస్తుంటే రకుల్ ప్రీత్ జెలస్ ఫీలవుతుందని… అంటున్నారు. మరి అంతేకదా.. తన అవకాశాలు పోగొట్టుకున్న టైం లో ఆ రేస్ లోకి మరో హీరోయిన్ వస్తే ఎవరికైనా జెలస్ వచ్చేస్తుంది..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*