రకుల్ భలే మాటలు చెప్పింది

వేంకటాద్రి ఎక్సప్రెస్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ఆ సక్సెస్ తో టాప్ హీరోస్ పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది . దాంతో ఆమె కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. రకుల్ గురించి తెలిసిన వాళ్లు ఆమె అందమే కాదు.. ఆమెకు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే అని అంటున్నారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో రకుల్ చెప్పిన మాటలు చూస్తుంటే అదే స్పష్టం అవుతుంది.

“రేపటి శ్వాసను ఈ రోజు పీల్చలేం..ఈరోజు ఇప్పుడు పీల్చే శ్వాస మనల్ని బతికిస్తుంది. సో నేను ఈరోజు ఇప్పుడు చేయవల్సిన పనులు గురించే ఆలోచిస్తా… రేపు ఏం జరుగుతుంది.. అనే దాని గురించి ఆలోచించను. సినిమాలు సక్సెస్ గురించి కూడా నేను ఆలోచించను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోత అంతే.

నాకు తెలిసిందే ఒక్కటే కష్టపడటం. రేపటి పరిస్థితి ఏంటన్న భయాలు పెట్టుకోను. నాకు వాస్తవంలో బతకడం తెలుసు. నా ఆత్మవిశ్వాసమే నాకు శ్రీరామరక్ష అని నేను భావిస్తూ వుంటాను” అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.