ప్రేక్షకులకు బోర్ కొడితే నేనే వెళ్లిపోతా..!

ఒకప్పుడు సినిమాల మీద సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ అవకాశాలు లేక ఖాళీగా ఉన్నప్పటికీ… కోలీవుడ్ లో సూర్య సినిమాలో వన్ అఫ్ ది హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవడ్ లో పవన్ కళ్యాణ్ తో తప్ప మిగతా స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు వరసబెట్టి సినిమాలు చేసిన రకుల్ కెరీర్ లో గొప్పగా చెప్పుకునేంత సినిమా మాత్రం రామ్ చరణ్ తో నటించిన ధ్రువ, ఎన్టీఆర్ తో నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలు మాత్రమే. అవి కూడా 100 కోట్ల క్లబ్బులో లేని సినిమాలే.

ఇంత నైరాశ్యం ఎందుకో..?

అయితే స్పైడర్ సినిమాలో మహేష్ తో జోడిగా నటించిన రకుల్ ప్రీత్ కి ఆ సినిమా డిజాస్టర్ తో టాలీవుడ్ లో భారీ గ్యాప్ వచ్చేసింది. తాజాగా ఎన్టీఆర్ సినిమాలో రకుల్ ప్రీత్ కి శ్రీదేవి కేరెక్టర్ చేసే అవకాశం వచ్చింది. అయితే అవకాశాలు లేని రకుల్ ప్రీత్ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదని.. లైఫ్ లో చాలా చేంజెస్ జరుగుతుంటాయని… ఈ రోజు ఉన్న పేరు, డబ్బు రేపు ఉండకపోవచ్చని.. అసలు వాస్తవాలను ఒప్పుకుంటే జీవితంలో భయాలకు చోటుండదని… తనకు నటించడం అనే పరుగు ఎప్పుడు ఆపాలో తెలుసని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

అవకాశాలు రాకున్నా… వ్యాపారం ఉందిగా…

అంతేకాకుండా తాను ప్రేక్షకులకు బోర్ కొడుతున్నాననిపిస్తే అప్పుడే సినిమాలకు దూరమవుతానని చెబుతుంది ఈ పంజాబీ భామ. మరి రకుల్ కి ఇంతటి నైరాశ్యం ఎందుకొచ్చిందో కదా పాపం. అంటే మరి అవకాశాలు లేకపోతె ఇలానే మాట్లాడతారు. అయినా రకుల్ కి అవకాశాలు లేకపోతె ఏమిటి… వ్యాపారం ఉందిగా అంటున్నారు కొందరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1