రకుల్ మీద రాశి పర్లేదు..!

రకుల్ ప్రీత్ సింగ్ లా ఇక్కడ సినిమాలు డిజాస్టర్స్ అయితే కోలీవుడ్ కి వెళ్లిపోలేదు రాశీ ఖన్నా. ఈమెకు హిట్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి ఈ అమ్మడికి. మరి ఏమైందో ఏమో ఈ మధ్య ఈమె సినిమాలు సెట్స్ మీద కనిపించడం లేదు. కొంత గ్యాప్ తీసుకుని వరస సినిమాలతో తెలుగులో, తమిళంలో తన సత్తా చాటడానికి మన ముందుకు రాబోతుంది. తమిళ ఇండస్ట్రీలో కూడా తన స్టామినాను చూపడానికి రెడీ అయింది రాశీ ఖన్నా. ఏకంగా నాలుగు సినిమాలకు సైన్ చేసింది. ఇవి కాకుండా ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మూడు సినిమాలు మాత్రం సెట్స్ మీద రెడీగా ఉన్నాయి. వాటితో పాటు నాలుగో సినిమా త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది. ఆ సినిమాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుగులోకి తిరిగి రానుంది.

రకుల్ మాత్రం అలా కాదు…

టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది రాశీ ఖన్నా. ఆమెకు ఇదే సరైన టైం అనుకుని చాలా పక్కా ప్లానింగ్ తో కోలీవుడ్ వెళ్లింది. కానీ రకుల్ ఆలా కాదు ఇక్కడ ఆఫర్స్ లేవని, చేసిన సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో అక్కడికి వెళ్లింది. దీంతో అటు ఇటు కాకుండా పోయింది రకుల్. చూద్దాం రాశీ ఖన్నా ఎంతవరకు సక్సెస్ అవుతుందో..?