ఎన్టీఆర్ లో రకుల్ రెమ్యునరేషన్ మరీ అంతా..?

టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో రోజుకో హాట్ న్యూస్ బయటికి వస్తుంది. ఇప్పటివరకు ఆ సినిమాలో నటిస్తున్న పాత్రలతోనే పిచ్చెక్కించిన క్రిష్ ఇప్పుడు సినిమాకి సంబందించిన మిగతా విషయాలపైనా ఫోకస్ పెట్టాడట. సినిమా విడుదలకు రెండున్నర నెలలు టైం ఉన్నప్పటికీ.. ఇప్పటినుండే ప్రమోషన్స్ లో ప్రత్యేకత చూపిస్తున్న బాలకృష్ణ – క్రిష్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల విషయంలో ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారనేది ఆయా ఆర్టిస్ట్ ల మేకప్ లే తెలియజేస్తున్నాయి. చంద్రబాబుగా రానా, ఏఎన్నార్ గా సుమంత్, ఎన్టీఆర్ గా బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్, దగ్గుబాటి లుక్ లో డాక్టర్ భరత్ రెడ్డిలు అదిరిపోయారు.

20 నిమిషాల పాత్రకే మరీ అంతా..?

ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి సన్నిహిత పాత్రలైన శ్రీదేవిగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ చేస్తుండగా.. ఇప్పటికే శ్రీదేవి గా రకుల్ లుక్ పై విమర్శలు వచ్చినప్పటికీ.. ఆ లుక్ కూడా అందరినీ అలరించింది. ఇక జయప్రదగా తమన్నా నటిస్తుందని చెబుతున్నప్పటికీ.. ఇంకా చిత్ర బృందం నుండి క్లారిటీ రాలేదు. ఇకపోతే శ్రీదేవి పాత్రలో కేవలం 20 నిమిషాల పాత్ర కోసం రకుల్ ప్రీత్ ఏకంగా ఎన్టీఆర్ బయోపిక్ మేకర్స్ ని కోటి రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. అయితే ఎన్టీఆర్ నట జీవితంలో శ్రీ దేవి పాత్ర చాలా కీలకమైంది కావడంతో ఎన్టీఆర్ మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చారట.

అసలే క్రేజ్ లేక…

మరి అసలే క్రేజ్ తగ్గిపోయిన రకుల్ ఇలా డిమాండ్ చేసి కోటి సంపాదించేయడం అంటే మాటలు కాదు. స్పైడర్ సినిమాతో కనబడకుండా పోయిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం వెంకిమామ చిత్రంలో నాగ చైతన్య కి జోడిగా నటిస్తుంది. ఇక తమిళం, బాలీవుడ్ లో ఒకటీ అరా సినిమాలు చేస్తున్న రకుల్ వెయిట్ మీద ప్రస్తుతం బోలెడన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జీరో సైజు అంటూ ఉన్న అందాన్ని పోగొట్టుకుంటూ జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తున్న రకుల్ ని కాస్త తగ్గమ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు రకుల్ అభిమానులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*