ఆ యాడ్ లో ఆమె మెప్పించలేకపోయింది!

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు మోడలింగ్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత సినిమాల వైపు కన్నేసింది. సందీప్ కిషన్ తో తన మొదటి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ పంజాబీ పాప. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ అందరితో నటించిన రకుల్.. ‘స్పైడర్’ సినిమా తర్వాత తెలుగులో కనిపించడం మానేసింది.

ఒక్క సినిమా కూడా లేక…

ప్రస్తుతం ఆమెకి తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం..ఆమె మళ్లీ తనకు పేరు తెచ్చిన మోడలింగ్ వైపు అడుగులేస్తోంది. లేటెస్ట్ గా ఈమె సినీ తారల సౌందర్య రహస్యం అంటూ లక్స్ సోప్ యాడ్ లో అలరించింది. లక్స్ వాళ్లు కొత్తగా ప్రవేశపెట్టిన శాఫ్రన్ గోల్డ్ యాడ్ లో కనిపించి.. తన కాన్ఫిడెన్స్ వెనుక రహస్యం ఇదంటూ చెప్పుకొచ్చింది.

గతంలోనూ తారలు…..

గతంలో లక్స్ యాడ్ లో చాలామంది స్టార్ హీరోయిన్స్ కనిపించారు. శ్రీదేవి… ప్రీతాజింతా.. కరీనా కపూర్ ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఈ లక్స్ యాడ్ లో నటించారు. అంతమంది స్టార్ హీరోయిన్స్ నటించిన లక్స్ యాడ్ లో రకుల్ కూడా భాగం అయినప్పటికీ ఆమె అంతగా మెప్పించలేకపోయింది. ఆ యాడ్ కి ఆమె సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. బహుశా ఆమె మరింతగా సన్నగా కనపడటం వల్లనేమో?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*