రకుల్ బాటలో మరికొందరు తయారవుతారా?

రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం అవకాశాలు లేక అల్లాడుతోంది. ఒకప్పుడు వరసబెట్టి స్టార్ హీరోలు, మీడియం హీరోలతో ఎడా పెడా సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ కి ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. తమిళంలో అయినా సెటిల్ అవుదామనుకుంటే… అక్కడా స్పైడర్ దెబ్బకి చుక్కలు కనబడ్డాయి. ప్రస్తుతం సూర్య పక్కన ఒక తమిళ్ మూవీలో నటిస్తున్న రకుల్ కి తెలుగులో ఒక మల్టీస్టారర్ లో నాగ చైతన్య పక్కన అవకాశం వస్తున్నట్లుగా టాక్ అయితే వినబడుతుంది.. కానీ కన్ఫర్మ్ లేదు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలే కాకుండా మరో విధంగా డబ్బు సంపాదిస్తుంది. ప్రస్తుతం బాగా వర్కౌట్స్ చేసి సన్నగా తయారైన రకుల్ ప్రీత్ సింగ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ తో భారీగా దండుకుంటుంది.

15 నిమిషాలకు 25 లక్షలా..?

తాజాగా హైదరాబాద్ లో జరిగిన జియో ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఫిలిం ఫేర్ ఈవెంట్ స్టేజ్ మీద చేసిన డ్యాన్స్ కి గాను అక్షరాలా 25 లక్షలు అందుకుంది. మరి కేవలం 15 నిమిషాల పర్ఫార్మెన్స్ కి రకుల్ ఆ రేంజ్ లో పారితోషకం అందుకుంది అంటే… అందరూ షాక్ అవుతున్నారు. మరి 25 లక్షలకు సరిపడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది లేండి రకుల్.. అంటే 25 లక్షలకు న్యాయం చేసిందన్నమాట. మరి రకుల్ కి సినిమా అవకాశాలు లేకపోయినా ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ తో భారీగానే దండుకుంటుంది. ఇక రకుల్ ని చూసి మిగతా టాప్ హీరోయిన్స్ కూడా ఇలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ కి చొరవ చూపుతారేమో. ఇప్పటికే టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ అగర్వాల్ విజయ్ అవార్డ్స్ కోసం కోలీవుడ్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*