ఇంత అందాన్ని టాలీవుడ్ ఎందుకొదిలేసింది!

కెరటం అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా చేశాక కెరీర్ లో నిలదొక్కుకుంది. ఇక మొదట్లో చిన్న సినిమాల్లో వరస ఆఫర్స్ తో దూసుకుపోయిన రకుల్ ప్రీత్ కి స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడానికి ఏమంత సమయం పట్టలేదు. రకుల్ టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చోకపోయినా… స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ టాప్ చైర్ కి దగ్గరగానే ఉంది. మంచి బాడీ ఫిట్నెస్ తో అందమైన కళ్లతో… గ్లామర్ షో కి అడ్డు చెప్పని భామగా రకుల్ చాలా తక్కువ సమయం లోనే టాప్ పొజిషన్ కి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ మెల్లిగా అవకాశాలు దక్కించుకున్న రకుల్ ప్రీత్ కి తెలుగు, తమిళంలో ఒకేసారి మహేష్ తో కలిసి నటించిన స్పైడర్ దెబ్బకి కెరీర్ లో భారీ గ్యాప్ వచ్చేసింది.

స్పైడర్ దెబ్బకి…

స్పైడర్ తో తెలుగు, తమిళంలో రకుల్ కి కోలుకోలేని దెబ్బతగిలింది. తెలుగులో అసలు ఆఫర్స్ లేకుండా పోయాయి. తమిళంలో మాత్రం సూర్య, కార్తీ సరసన నటిస్తూ కాస్త బిజీ అయ్యింది. అయితే అవకాశాలు లేకపోయినా బాడీని బాగా మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ అంతే అందాన్ని, అంతే గ్లామర్ ని రకుల్ మెయింటైన్ చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రను దక్కించుకున్న ఈ సుందరి ఒక గ్లామర్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మారి ఆ ఫోటో చూసిన ఎవరైనా ఇంత అందాన్ని టాలీవుడ్ ఎందుకు పక్కన పెట్టేసిందబ్బా.. అనిపించకమానదు.

పోటీగా వచ్చేసిన పూజా హెగ్డే…

తెల్లని డిజైనర్ డ్రెస్సులో చెవులకు పెద్ద పెద్ద బుట్టలు, మేడలో చిన్నపాటి బంగారు ఆభరణం, చేతులకు గాజులతో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో చాలా సింపుల్ గా తన అందాన్ని చూపిస్తోంది ఈ పంజాబీ బ్యూటీ. మరి రకుల్ ప్రీత్ కి ఒక్క స్టార్ హీరో సినిమాలో అవకాశమొచ్చినా… మళ్లీ టాప్ పొజిషన్ లోకి వచ్చెయ్యడం ఖాయం. ఇక రకుల్ కి గ్యాపొచ్చిన టైం లో హీరోయిన్ పూజ హెగ్డే ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గరయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1