చరణ్ కోసం రంగంలోకి రకుల్..?

రామ్ చరణ్ తో రకుల్ ప్రీత్ సింగ్ రెండుసార్లు జోడి కట్టింది. అందులో ఒకటి ఫెయిల్ కాగా… మరొకటి బ్లాక్ బస్టర్ హిట్. బ్రుస్ లీ ఫట్ అవగా.. ధ్రువ హిట్. అయితే ఇప్పుడు తాజాగా చరణ్ తో రకుల్ మరోసారి నటిస్తుందంటున్నారు. అయితే ప్రస్తుతం బోయపాటి సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్… భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తుంది. మరి రాజమౌళి సినిమాకి ఇంకా హీరోయిన్స్ ని ఫైనల్ చెయ్యలేదు. చరణ్, ఎన్టీఆర్ రోల్స్ ని రాజమౌళి సెట్ చేసినా వారికీ హీరోయిన్స్ ని సెట్ చెయ్యలేదు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ చరణ్ పక్కన నటించడం లేదట… కేవలం ఐటెం సాంగ్ మాత్రమే చేస్తుందట.

ఐటమ్ సాంగ్ తోనైనా బిజీగా మారేనా..?

మరి బోయపాటి సినిమాలో కంపల్సరీగా ఒక ఐటెం సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా ఒక అదిరిపోయే లెవల్లో ఉంటుంది. అయితే తన సినిమాలు సరైనోడు, జయ జానకి నాయక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ చరణ్ సినిమాలో ఒక ఐటెం కోసం సంప్రదించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రాజవంశస్థుడిగా రామ్ చరణ్ కనబడతాడనే సమాచారం ఉంది. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి సినిమా త్వరలో జైపూర్ కోటల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చెపట్టనున్నారు. ఇక ఈ సినిమాలో రకుల్ ఐటెం సాంగ్ చేస్తే కచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఫిలింఫేర్ స్టేజ్ మీద అదరగొట్టే డాన్స్ పెరఫార్మెన్స్ లో అందరిని అలరించింది. ఇక ఇప్పుడు ఎలాగూ అవకాశాలు లేక రకుల్ ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది. మరి చరణ్ సినిమాలో ఐటెం సాంగ్ తో అయినా రకుల్ మరోసారి బిజీ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ కి తెలుగులో సరైన అవకాశాలు లేవు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*