రకుల్ చేసిన పని తెలివైనదే..!

ఒకప్పుడు టాలీవుడ్ లో ఎడా పెడా సినిమా లు చేస్తూ అస్సలు రెస్ట్ లేకుండా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ కి గత ఏది నుండి అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జోడికట్టిన ఈ భామ ఆఖరుకి చిన్న హీరోల సినిమాలు కూడా చేసింది. అయితే తనకి అవకాశాలు తగ్గడంపై గతంలో రకుల్ ఎలా స్పందించింది అంటే.. తనకి అసలు రెస్ట్ లేకపోవడం వల్లనే సినిమాలు ఒప్పుకోవడం లేదని.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ సినిమాలు చేస్తానని చెప్పింది. కానీ స్పైడర్ దెబ్బకి అమ్మడుకి అవకాశాలే లేకుండా పోయాయి. ఆఖరుకి కోలీవుడ్ లో కూడా రకుల్ పాగా వెయ్యలేకపోయింది.

రెమ్యునరేషన్ తగ్గించి మరీ…

తాజాగా తెలుగులో నాగ చైతన్య పక్కన వెంకీ మామ అనే మల్టీస్టారర్ లో నటిస్తున్న రకుల్ కోలీవుడ్ లో సూర్య పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఒకప్పుడు బాగా బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ప్రసుతం బాగా ఖాళీ అయ్యింది. అయితే తనకి అవకాశాలు తగ్గడంపై ఫోకస్ పెట్టిన రకుల్ ప్రస్తుతం వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకోవడమే కాదు.. తన అవకాశాల కోసం తన రెమ్యునరేషన్ ని 25 శాతం తగ్గించిందనే న్యూస్ టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎలాగూ క్రేజ్ పోతున్న తరుణంలో రకుల్ తీసుకున్న ఈ డెసిషన్ ఆమెకి ఏమైనా మంచి చేస్తుందో లేదో చూడాలి

మంచి ప్లాన్ తోనే…

కాకపోతే రకుల్ మాత్రం బాగా తెలివైందే. అవకాశాల కోసం రెమ్యునరేషన్ తగ్గించుకుని ఒక్క సినిమా హిట్ అందుకోగానే మళ్లీ తన పారితోషకాన్ని పెంచెయ్యొచ్చనే ప్లాన్ లో ఉన్నట్లుగా వుంది. ఇకపోతే టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ వెంకీ మామ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ బయో పిక్ లోను ఒక స్పెషల్ సాంగ్ లో నటించనున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ విషయంలో ఇంకా ప్రకటన మాత్రం రాలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*