నేను క్షణం ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నా…!!

అందంతో పాటు టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కరు. ‘వెంకటాద్రి ఎక్సప్రెస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ వరసగా తెలుగులో సినిమాలు చేసి మహేష్ తో ‘స్పైడ‌ర్’ చేసిన త‌ర్వాత ఆమె జోరు త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చినా దాదాపు తొమ్మిదేళ్లు కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పటికి పాతిక పైనే సినిమాల్ని పూర్తి చేసింది.

అవకాశాలు తగ్గయా….?

తెలుగులో దాదాపు స్టార్ హీరోలు పక్కన జతకట్టిన రకుల్.. ‘స్పైడ‌ర్ తర్వాత కనిపించడం లేదు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే సత్తా ఉన్న రకుల్ ఒక్కసారిగా కనుమరుగైపోడంతో..అవ‌కాశాలు త‌గ్గాయా? అని ప్రశ్న వేస్తే ఆమె దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానాన్ని ఇచ్చింది. ‘స్పైడర్’ తర్వాత కనిపించడం లేదని వస్తున్నా వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే నేను ‘స్పైడర్’ కి ముందే తమిళంలో మూడు నాలుగు సినిమాలు సైన్ చేసానని..ఆటైంలో నేను బాలీవుడ్ లో ‘అయ్యారీ’ సినిమాలో బిజీగా ఉన్నానని.. అందుకే నేను తెలుగు సినిమాలు ఒప్పుకోలేదని.. డైరీలో ఎంత వెతికినా 30 రోజులే ఉంటాయని చమత్కారంగా సమాధానం ఇచ్చింది.

ఆఫర్స్ రావడం లేదని……

నేను సినిమాలతో ఇంత బిజీగా ఉంటె..రకుల్ కు ఆఫర్స్ రావడంలేదని రాస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం రకుల్ తమిళంలో సూర్యతో ఎన్ ‘జీకే’.. కార్తీ 17.. శివ‌కార్తీకేయ‌న్ తో ఓ సినిమా చేస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో అజ‌య్ దేవ‌గ‌ణ్ తో ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో యాక్ట్ చేస్తుంది. సో ఇలా నేను క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాని..’స్పైడ‌ర్’ త‌ర్వాత నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ తాను ఒక్క రోజుకూడా ఖాళీగా లేన‌ని కొంచం ఘాటుగానే చెప్పింది. అది మ్యాటర్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*