ఎటువంటి హైప్ లేకుండా సింపుల్ గా వస్తారా..?

koratala film with chiranjeevi

ఈ మధ్యన సినిమాలన్నీ ఫస్ట్ లుక్స్, టీజర్స్ బయటికి రాకముందే నెట్ లో లీకై భారీ బడ్జెట్ చిత్ర బృందాలను తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఏదైనా సినిమా ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ విడుదలవుతుంది అని అనౌన్స్ చేస్తున్నారో లేదో.. ఈ లోపు ఆ సినిమా యూనిట్ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆ లుక్ కి సంబంధించిన పిక్స్, టీజర్ లోని కొన్ని సీన్స్ ఇంటర్నెట్ లో లీక్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత యూనిట్ సభ్యులు ఎంతగా జాగ్రత్త పడ్డప్పటికీ.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అయితే ఇప్పుడు టైటిల్ విషయంలోనూ కొన్ని లీక్స్ బయటికొచ్చి… తర్వాత ఆటోమాటిక్ గా బయటికొచ్చిన టైటిల్స్ లో ఏదో ఒకటి చిత్ర బృందం ఫైనల్ చేస్తుంది.

జాగ్రత్తలు తీసుకుంటున్న బోయపాటి

అయితే ఒక భారీ బడ్జెట్ సినిమా విషయంలో మాత్రం అలాంటి లీకులేవీ బయటికి రావడం లేదు. ఆ సినిమా ఏమిటంటే రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మాస్ ఎంటెర్టైనెర్. రామ్ చరణ్ రంగస్థలం వంటి పీరియాడికల్ మూవీ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో బోయపాటి – రామ్ చరణ్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే బిహార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా మొదలు పెట్టి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ సినిమా టైటిల్ గానీ, లుక్ గానీ బయటికి రాలేదు. అసలు ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి విషయాలు బయటికి రాకుండా దర్శకుడు బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

పవన్ పుట్టినరోజు కానుకగా…

భారీ అంచనాలున్న ఈ సినిమా మీద ఎలాంటి లీకులు బయటికి వచ్చినా…. భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పటికే మంచి అంచనాలున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని.. అందుకే ఏ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారట. అందుకే ఎలాంటి హైప్ లేకుండా సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే సందర్భంగా సింపుల్ గా లుక్ తో పాటు టైటిల్ ని రివీల్ చెయ్యాలని భావించే… కనీసం టైటిల్ ప్రకటిస్తామనే విషయాన్నీ కూడా చెప్పకుండా గోప్యత పాటిస్తున్నారట. రామ్ చరణ్ కి జోడిగా భరత్ లవర్ కియారా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*