ఈసారి పవర్ పోలీస్ అధికారిగా.!

సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో రమ్ చరణ్ తేజ్ దివ్యంగుడిగా, పల్లెటూరి అబ్బాయిలా అదరగొట్టాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు అందరూ నీరాజనాలు పట్టారు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నిజంగానే తన పెరఫార్మెన్స్ తో అందరి మన్ననలు పొందాడు. తాజాగా రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో RC12 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. బోయపాటి సినిమాల్లో మాస్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. బోయపాటి అంటే యాక్షన్.. యాక్షన్ అంటే బోయపాటి అన్నట్టుగా ఉంటాయి బోయపాటి సినిమాలు. అలాంటి మాస్ ఎంటర్టైన్మెంట్ లో రామ్ చరణ్ ఎంత పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడో అనే క్యూరియాసిటీ కేవలం మెగా ఫాన్స్ కి మత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా ఉంది.

మళ్లీ అదే పాత్రలో…

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ వవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడని అంటున్నారు. మరి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో రామ్ చరణ్ ని ఇదివరకే చూసేసాం. బాలీవుడ్ లో జంజీర్ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ అధికారిగానే నటించాడు. ఆ సినిమా తెలుగులో తుఫాన్ పేరుతో విడుదలై ఫ్లాప్ అయ్యింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ అధికారిగా ఇరగదీసాడు. మైండ్ గేమ్ ఆడుతూ శత్రువును మట్టి కురిపించే అధికారిగా రామ్ చరణ్ నటన ఆద్యంతం అద్భుతం అన్నట్టుగా వుంది. ఇక ఇప్పుడు బోయపాటి సినిమాలో రామ్ చరణ్ మరెంత పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా ఇరగదీస్తాడో చూడాలి.

వచ్చే సంక్రాంతికి విడుదల…

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్, వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ రామ్ చరణ్ అన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా విడుదల కాబోతుంది.

Sandeep
About Sandeep 4916 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*