రామ్.. విజయ్ దేవరకొండని ఫాలో అవుతున్నాడా..!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ ఐకాన్. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు విజయ్ దేవరకొండని అందనంత ఎత్తులో కూర్చోబెట్టాయి. అయితే ఇప్పుడు రామ్ పోతినేని కూడా విజయ్ దేవరకొండని ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ పోతినేని గీత గోవిందం సినిమాలో మాదిరిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గీత గోవిందం. రశ్మికతో రొమాన్స్ చేసిన విజయ్ ఈ చిత్రంతో 100 కోట్ల క్లబ్బు హీరోగా అవతరించాడు. అయితే గీత గోవిందం విడుదల కాకముందు గీత గోవిందం టీజర్ ఒకటి వదిలారు. ఆ టీజర్లో బ్లాక్ అండ్ వైట్ లో విజయ్ ట్రాక్టర్ మీద ఎన్నెన్నో జన్మల బంధం అనే పాటని వింటూ రష్మిక నడుమందాలతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. మరి ఆ గీత గోవిందం టీజర్ మాత్రమే కాదు సినిమా కూడా హిట్. అయితే ఆ టీజర్ లో చూపించిన కంటెంట్ ని సినిమాలో విజయ్ దేవరకొండ కలలో చూస్తాడు.

అచ్చం గీత గోవిందం టీజర్ లానే…

ఇకపోతే తాజాగా రామ్ – అనుపమ జంటగా తెరకెక్కుతున్న సినిమా టీజర్లో కూడా అనుపమ నడుమందాలు హైలెట్ అయ్యాయి. హాట్ గా అంటూ రామ్ కాఫీ తీసుకుని అనుపమని పోగొడడం.. అనుపమ పరమేశ్వరన్ కూడా అటుతిరిగి నడుం ఒంపులు చూపిస్తూ తల దువ్వుకోవడం.. అటుగా వచ్చిన రామ్ ఆ దృశ్యం చూసి మైమరిచిపోవడం.. ఇలా అన్ని విజయ్ దేవరకొండ గీత గోవిందం టీజర్ తో సింక్ అవుతున్నట్టుగా.. రష్మిక నడుము, అనుపమ పరమేశ్వరన్ నడుము అందాలు కూడా ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. మరి నిజంగానే రామ్.. విజయ్ ని ఫాలో అయ్యాడా.. లేదంటే అనుకోకుండా అలా జరిగిందా అనేది మాత్రం కాస్త క్యూరియాసిటీని కలిగించే అంశం. ఏది ఏమైనా ఈ రెండు టీజర్స్ లో హీరోయిన్ చీర అందాలు మాత్రం అద్భుతః అన్న చందంగా ఉన్నాయంటే నమ్మాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1