ఆఫీసర్ ట్రైలర్ రివ్యూ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఒక్కపుడు క్రేజ్ ఉండేది కానీ గత కొంత కాలంగా అయన తీస్తున్న చిత్రాలు అన్ని దాదాపు డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఆయన పంతం మారలేదు. ఆపకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. రాముని సినీ ఇండస్ట్రీకి ‘శివ’ సినిమాతో పరిచయం చేసిన నాగార్జున.. ప్రసుతం అతని డైరెక్షన్ లో ఓ సినిమా చేసాడు.

ఆ సినిమాకు టైటిల్ ‘ఆఫీసర్’ అని పెట్టారు. ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అయితే వీరి కాంబినేషన్ లో రూపొందిన ‘ఆఫీసర్‌’ సినిమా నుండి ఈరోజు ఉదయం ట్రైలర్ ని విడుదల చేశారు. ‘ప్రతి మనిషిలో ఒక దేవుడు, రాక్షసుడు ఇద్దరూ ఉంటారు’ అంటూ నాగార్జున చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది.

ట్రైలర్ లో సీన్స్ చూస్తుంటే ఇది పక్క యాక్షన్ ఫిలిం అని అర్ధం అవుతుంది. దానికి తోడు కూతురు సెంటిమెంట్ కూడా రాము బాగానే వర్క్ అవుట్ చేసాడేమో అనిపిస్తుంది. ట్రైలర్ లో కొన్ని కెమెరా యాంగిల్స్ తో రాము మతిపోగొట్టాడనే చెప్పాలి. రాము తీసే రెగ్యులర్ సినిమాలానే ఈ సినిమా కూడా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా ట్రైలర్ పర్లేదు కానీ సినిమానే ఎలా తీసాడో చూడాలి. రాము – నాగ్ కాంబినేషన్ సినిమా కాబట్టి మరో ‘శివ’ అవుతుందేమో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*