గర్భవతి కావడంతో… రీ ఎంట్రీ అవకాశం పోయిందా?

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ అరవింద సమేత.. వీర రాఘవ సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారు. దసరా కి విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉన్న దర్శకుడు, హీరో షూటింగ్ కి చిన్న విరామం కూడా ఇవ్వడం లేదు. పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న ఎన్టీఆర్ కోసం మరో తెలుగు హీరోయిన్ ని త్రివిక్రమ్ తీసుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈషా రెబ్బ. అ!! సినిమా తో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో ఈషా పాత్ర ఎక్కువగా కనిపించే పాత్ర కాదని, చిన్న పాత్రే అయినా అది కీలక పాత్ర కావడంతోనే ఈషా ఈ అవకాశాన్ని ఒప్పుకుందని అంటున్నారు.

త్వరలోనే షూటింగ్ ఉందని…

అయితే హీరోయిన్ పూజ హెగ్డే, ఈషా రెబ్బ తో పాటుగా త్రివిక్రమ్ తన ఆనవాయితీ ప్రకారం ఈ సినిమా లో ఒక సీనియర్ హీరోయిన్ ని తీసుకుంటాడని ప్రచారం జరిగింది. అందులో మీనా, లయ పేర్లు మొదట్లో వినబడినప్పటికీ తాజాగా ఆ లిస్ట్ లోకి రంభ వచ్చి చేరింది. ఇక రంభ తో త్రివిక్రమ్ ఇప్పటికే సంప్రదింపులు జరిపాడని, రంభ ఒప్పుకుందని, అతి త్వరలోనే రంభ షూటింగ్ లో జాయిన్ అవుతుందని అంటున్నారు. కానీ తాజాగా రంభ, త్రివిక్రమ్ సినిమాలో నటించడం లేదని తెలుస్తుంది.

గర్భవతి అయినందునే…

కారణమేమిటంటే రంభ ప్రస్తుతం గర్భవతి కావడంతో తమ ప్రతిపాదనను త్రివిక్రమ్ అండ్ టీమ్ ఉపసంహరించుకున్నారట. రంభ కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే మొన్నామధ్యన రంభ తన భర్త తో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కినా తర్వాత మళ్లీ భర్త తో కలిసిపోయింది. ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్న రంభ ఇప్పుడు మూడోసారి గర్భవతిగా ఉంది. అందుకే ఆమెను మూవీలోకి తీసుకునే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ తన సినిమాల్లో సీనియర్ కి కీలక పాత్రలిస్తుంటాడు. ఇక అరవింద సమేత లో కూడా రంభ పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంటుందట. ఇక ఇప్పుడు రంభ స్థానంలోకి మరో క్రేజున్న సీనియర్ హీరోయిన్ వేటలో అరవింద బృందం పడిందట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*