బాలీవుడ్ మూవీస్ పై క్లారిటీ ఇచ్చిన చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ”రంగస్థలం” సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ తన నెక్స్ట్ మూవీతో బిజీగా ఉన్నాడు. చరణ్ కు బాలీవుడ్ లో కూడా నిలదొక్కుకోవాలనే కోరిక ముందు నుంచే ఉంది. గతంలోనే ‘జంజీర్’ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

అలా అనికాదు….

అయితే చరణ్ లేటెస్ట్ గా ఓ టీవీ ఇంటర్వ్యూలో…” బాలీవుడ్ లో సినిమాలు చేయకూడదని ఉదేశం అయితే లేదు..ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నా. కాబట్టి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. గత రెండేళ్లుగా చూసుకుంటే టాలీవుడ్ సినిమా బౌండరీలు దాటిపోయింది. ‘అర్జున్ రెడ్డి’..’బాహుబలి’..’రంగస్థలం’ సినిమాలు కంటెంట్ కు హద్దులు లేవనే విషయాన్ని ప్రూవ్ చేశాయి” అని చెప్పిన చరణ్ తాను బాలీవుడ్ పై ఫ్యూచర్ లో దృష్టి పెడతానని ఇండైరెక్ట్ గా చెప్పాడు.

డబ్బింగ్ చేస్తామని…..

‘రంగస్థలం’ సినిమాను డబ్బింగ్ చేస్తామని వేరువేరు భాషలు వాళ్లు వస్తున్నారని, కానీ తాము ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని అన్నాడు చరణ్. ప్రస్తుతం బోయపాటి సినిమాతో ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు చరణ్. దసరాకు ఈ సినిమా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*