ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న రామ్ చరణ్!

Ajay Devagan Rashmika Mandanna to act in charan ntr rajamouli cinema

ట్రేడ్ ని ఫాలో అవ్వడంతో మన హీరోస్ ని మించిన వాళ్లు లేరనే చెప్పాలి. ఫ్యాన్స్ కోసం మన హీరోలు ఏది చేయడానికైనా రెడీ అంటున్నారు. గత కొనేళ్లనుండి టాలీవుడ్ సిక్స్ ప్యాక్ ట్రేడ్ నడుస్తుంది. తమ హీరోస్ ఆలా చొక్కా విప్పి బాడీ చూపిస్తూ.. ఫైట్లు చేస్తే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. రీసెంట్ గా రిలీజ్ ఐన ‘అరవింద సమేత’ విషయంలో అదే జరిగింది. సినిమా స్టార్టింగ్ లో ఎన్టీఆర్ తన సిక్స్ ప్యాక్ ని చూపించడంతో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చాయి. దానికి తోడు ఆ ఫైట్ ఎపిసోడ్ చాలా బాగా తీర్చిదిద్దాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

సేమ్ టు సేమ్…….

అదేవిధంగా మాస్ డైరెక్టర్ బోయపాటి రామ్ చరణ్ ను చూపించనున్నాడని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ తాజాగా ఈ న్యూస్ తో చెర్రీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇందులో చరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడని తెలుస్తుంది. ‘ధృవ’ కోసం బాడీను మంచి షేప్ తెచ్చి ఇంకా బాగా బాడీ పెంచి బోయపాటి సినిమాలో చూపించబోతున్నాడు అని టాక్. ఆ బాడీని ఎలివేట్ చేస్తూ బోయపాటి ఒక యాక్షన్ ఘట్టాన్ని తీర్చిదిద్దాడట. ఈ ఎపిసోడ్ అంతా చరణ్ సిక్స్ ప్యాక్ తోనే ఉంటాడట.

వినయ విధేయ రామ……..

బోయపాటి ఇటువంటి మాస్ సీన్స్ తీయడంలో ఎక్స్పర్ట్. భారీ యాక్షన్ లో రూపొందుతున్న ఈసినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ను పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దసరా కానుకగా ఈసినిమా టైటిల్ తో పాటు రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేయనున్నారు మేకర్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*