వామ్మో….వర్మ అంటున్న యంగ్ హీరో

ఆఫీసర్ సినిమా దారుణ పరాభవం రాంగోపాల్ వర్మ భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కప్పుడు అక్కినేని నాగార్జునతో శివ అనే హిట్ సినిమా చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత అదే నాగార్జునతో ఆఫీసర్ సినిమా చేశాడు. అయితే, ఎవరూ అవకాశాలు ఇవ్వని సమయంలో నాగార్జున రాంగోపాల్ వర్మతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అంతేకాదు తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ కూడా రాంగోపాల్ వర్మతో సినిమా చేయించాలనుకున్నాడు. తనకు ఒకప్పుడు భారీ హిట్ ఇచ్చిన దర్శకుడిపై నాగార్జునకు నమ్మకం కాస్త ఎక్కువే ఉందని అందరూ అనుకున్నారు.

లండన్ ఫ్లైట్ ఎక్కిన అఖిల్…

అయితే, ఆఫీసర్ రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. సినిమా బాక్సాఫిస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో నాగార్జున అభిమానులు సైతం రాంగోపాల్ వర్మతో జట్టుకట్టిన తమ హీరో పట్ల అంసతృప్తి వ్యక్తం చేశారు. కొందరు వీరాభిమానులైతే ఏకంగా వర్మ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరీ తమ హీరోతో ఇక సినిమా చెయొద్దని వేడుకున్నారు. దీంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. దీంతో రాంగోపాల్ వర్మతో సినిమా చేయాలనుకున్న అఖిల్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. మన సినిమా ఉండదని తేల్చిచెప్పి, లండన్ ఫ్లైట్ ఎక్కాడంట. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో అఖిల్ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి మిస్టర్ మంజూ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*