దానికి కారణం పవన్ కల్యాణే!

రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయడం కన్నా సినిమాలను అనౌన్స్ చేయడం విషయంలో ఎక్స్ పెర్ట్. తనకి నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా సినిమా తీయడం విషయంలో స్లో అయ్యాడనే చెప్పాలి. లేటెస్ట్ గా ఇతను నాగార్జున తో ‘ఆఫీసర్’ అనే సినిమాను తీసాడు.

వాటంతట అవే….

ఆ సినిమా ప్రొమోషన్స్ టైంలో ఆయన ఓ దినపత్రికతో మాట్లాడుతూ.. “గతంలో తాను ఎనౌన్స్ చేసిన సినిమాలు ఓ 10 వరకూ ఉన్నాయని, అవన్నీ సమయం వచ్చినప్పుడు వాటంతట అవే వస్తాయని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. తనకు చిన్నప్పటినుండి వివాదం నిండిన సబ్జెక్టులంటే ఇష్టమని అన్నారు.

రెండు నెలల్లో అఖిల్ తో….

తన వెనుక దేవుడు ఉన్నాడని అందుకే నేను ఎవరినన్నా విమర్శించేటప్పుడు ధైర్యంగా వారిని విమర్శిస్తానని వర్మ అన్నాడు. తన పని అయిపోయింది అని అనుకునేవారి కోసం ‘ఆఫీసర్’ సినిమా తీశానని చెప్పాడు. ఈ సినిమా ట్రైలర్ కు నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడానికి గల కారణాలు ఏంటో పవన్ కల్యాణ్ అభిమానులను అడగాలని అన్నారు. అఖిల్ తో తాను ప్రకటించిన సినిమా రెండు నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*