మళ్లీ శివగామి అంత పవర్ ఫుల్ పాత్ర వస్తుందా..?

రాజమౌళి తన బాహుబలి సినిమాకి శివగామిగా రమ్యకృష్ణని ఎంపిక చేసి అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు. రాజమాతగా.. నా మాటే శాసనం అంటూ భారీ పవర్ ఫుల్ డైలాగ్ తో అందరి మనసులను దోచేసిన రమ్యకృష్ణ కి మళ్లీ అలాంటి అదరగొట్టే పాత్ర రావడం అనేది కలే. కానీ తాజాగా మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య కి పొగరుబోతు అత్తగా శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. అయితే శైలజ రెడ్డి అల్లుడు సినిమా పాత్ర శివగామిని మరిపిస్తుందని అంటున్నారు. కానీ బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణ నడక, నటన.. ఆ పాత్రలోని హావభావాలు అన్ని కూడా రమ్యకృష్ణ కి మంచి పేరు తీసుకొచ్చాయి. గతంలో రజనీకాంత్ నరసింహలో రమ్యకృష్ణ ఎంతగా హైలెట్ అయ్యిందో బాహుబలిలో శివగామిగా అంత కన్నా ఎక్కువే హైలెట్ అయ్యిందని చెప్పాలి. మరి ఇప్పుడు శైలజ రెడ్డి అల్లుడు సినిమాలోనూ రమ్యకృష్ణ పొగరుబోతు అత్తగా అధికారం చూపిస్తుందని.. ఈ సినిమాతో రమ్యకృష్ణ కి మరిన్ని రోల్స్ రావడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

రమ్యకృష్ణ కోసం దర్శకనిర్మాతల క్యూ

అలాగే రమ్యకృష్ణ అడిగిన పారితోషకం ఇవ్వడానికి కూడా దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. మరి ప్రత్యేకించి రమ్యకృష్ణకి మంచి పవర్ ఉన్న పాత్రలను తమ సినిమాల్లో క్రియేట్ చేస్టున్నారు అంటే రమ్యకృష్ణ డిమాండ్ ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. ఇక తమ సినిమా గురించి కథ అనుకున్నదే తడువుగా రమ్యకృష్ణ డేట్స్ కోసం దర్శక నిర్మతలు క్యూ కడుతున్నారని టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో బిజీగా వున్నా రమ్యకృష్ణ డిమాండ్ ఈ రేంజ్ లో ఉందంటే.. సినిమాలో హీరోయిన్ ని సెట్ చేసే కన్నా ముందు రమ్యకృష్ణ డేట్స్ కోసం ఆరాటపడుతున్నారంటే తెలుస్తుంది ఆమె రేంజ్. తాజాగా రమ్యకృష్ణ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దర్శకుడు సాగర్ చంద్ర – వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాలో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలోనూ రమ్యకృష్ణ రేంజ్ కి తగినట్టుగానే ఆమె పాత్ర వుంటుందట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*