చంద్రబాబు పాత్రపై క్లారిటీ ఇచ్చిన రానా

tabu in rama movie

రోజురోజుకి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సినిమాకు క్రిష్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. అంతే కాకుండా బాలీవుడ్ నటి విద్య బాలన్ ఇందులో ఎన్టీఆర్ భార్య పాత్ర పోషించటం విశేషం. ఇకపోతే లేటెస్ట్ గా ఈ సినిమాలోకి రానా కూడా చేరాడు. ఇందులో రానా..ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయంపై రానా స్పందించి తాను ఇందులో చంద్రబాబు పాత్ర చేస్తున్నాని క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు రానాపై టెస్ట్ కట్ పూర్తయింది. గడ్డాన్ని కాస్త సరిచేసి, పసుపు రంగు చొక్కా వేసి అచ్చమైన చంద్రబాబులా రానాను ముస్తాబు చేశారు.

అచ్చం చంద్రబాబులా…

అంతేకాకుండా చంద్రబాబు మేనరిజమ్స్ తో డైలాగ్స్ కూడా ప్రాక్టీస్ చేసాడంట రానా. సినిమాలో రానాకు 3 బలమైన సన్నివేశాలున్నాయట. ఎన్టీఆర్ – చంద్రబాబు సాన్నిహిత్యాన్ని చూపించడం, చంద్రబాబు – ఎన్టీఆర్ కూతురుని పెళ్లి చేసుకోవడం వంటి సీన్స్ ఇందులో చూపించబోతున్నారు. ఇకపోతే ఇందులో కృష్ణుడి పాత్ర కోసం డైరెక్టర్ క్రిష్ మహేష్ బాబును కలిసాడంట. అయితే మహేష్ మాత్రం నో చెప్పాడని టాక్. మరి ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారో చూడాలి.

Sandeep
About Sandeep 6185 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*