చంద్రబాబు లా మారిన రానా..?

రానా దగ్గుబాటి ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో లీనమైపోతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలిలో భళ్లాలదేవుడు కానివ్వండి, నేనే రాజు నేనే మంత్రి లో జోగేంద్ర కానివ్వండి… ఏ పాత్ర అయినా ఆ పాత్రలో పరకాయప్రవేశం చేస్తుంటాడు. భల్లాలదేవుడి కోసం బరువు పెరిగిన రానా తాజాగా ఎన్టీఆర్ బయో పిక్ లో చంద్రబాబు పాత్ర కోసం బాగా బరువు తగ్గాడు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో రానా నారా చంద్రబాబు పాత్రలో నటిస్తున్నాడు. రానా చంద్రబాబు పాత్ర చెయ్యబోయే ముందు చంద్రబాబు దగ్గరికి వెళ్లి ఆయన మేనెరిజమ్స్ ను పరిశీలించాడు. చంద్రబాబు పాత వీడియోలను చూసిన రానా ఆ విషయాలను బాగా చర్చించి, చంద్రబాబు లా… రానా కూడా అచ్చం పొలిటికల్ లీడర్ వలె మారిపోయాడు.

చంద్రబాబులా దిగిపోయాడు…

ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ స్పాట్ నుండి బయటికొచ్చిన రానా లీక్డ్ పిక్ చూస్తుంటే మాత్రం అచ్చం చంద్రబాబు నాయుడి మాదిరిగా రానా దిగిపోయాడంటున్నారు. ఇంతకుముందే బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్ ఉన్న లుక్ ని వదిలారు. మరి ఆ లుక్ లో బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్ ని పోలినట్టే ఉన్నాడు. తాజాగా రానా లుక్ కూడా సేమ్ చంద్రబాబు లుక్ మాదిరిగానే కనబడుతుంది. మారి ఆ లుక్ లో రానా షేవింగ్ చేసుకుని… అచ్చం చంద్రబాబు మాదిరిగా కనబడుతున్నాడు. ఈ సినిమా లో క్రిష్ ఏ పాత్ర అయినా పాత వారిని గుర్తుకు రాకుండా చేసే ప్రయత్నమేదో బాగా మొదలెట్టినట్టుగా కనబడుతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*